: కోహ్లీ కూడా ధోనీలా జట్టును విజయవంతంగా నడపాలి: గుంగూలీ
టీమిండియా అన్ని ఫార్మాట్లకు విరాట్ కోహ్లీని కెప్టెన్ గా నియమించడంపై దిగ్గజ మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించాడు. కోల్ కతాలో గంగూలీ మాట్లాడుతూ, సెలెక్టర్లు మంచి నిర్ణయం తీసుకున్నారని అభిప్రాయపడ్డాడు. కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా విజయపథంలో పయనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ధోనీ స్థానంలో కెప్టెన్ గా విరాటే సరైన వ్యక్తని గంగూలీ తెలిపాడు. ధోనీ మాదిరే కోహ్లీ కూడా సమాన స్థాయిలో జట్టుకు విజయాలు అందిస్తాడని, ఇందులో సందేహం లేదని గంగూలీ భరోసా ఇచ్చాడు.