: జగన్ అజ్ఞానానికి సీమ ప్రజలు నవ్వుకుంటున్నారు: దేవినేని ఉమ


‘పట్టిసీమ’ను సాకారం చేసి చూపామని, వైఎస్ జగన్ అజ్ఞానం చూసి రాయలసీమ ప్రజలు నవ్వుకుంటున్నారని ఏపీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, చిత్తశుద్ధి లేని జగన్ ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఫలితం ఉండదని, అవినీతి పాపాలు వెంటాడుతూనే ఉంటాయని అన్నారు. శ్రీశైలం వెళ్లిన జగన్ కనీస అవగాహన లేకుండా మాట్లాడారని, పైనుంచి వరద నీరు రాకపోయినా రాయలసీమకు నీటి పంపిణీ జరిగిందని, 128 టీఎంసీలు రాయలసీమకు పంపిన విషయం జగన్ కు తెలియదా? అని ప్రశ్నించారు. రికార్డు స్థాయిలో పురుషోత్తపట్నం పూర్తి చేసి చూపిస్తామని, ప్రాజెక్టులపై బురదజల్లితే జగన్ చరిత్ర హీనుడు కాక తప్పదని దేవినేని విమర్శించారు.

  • Loading...

More Telugu News