: ‘జన్మభూమి’ సభలో రావెల, జానీమూన్ వర్గాల ఘర్షణ!
ఏపీ మంత్రి రావెల, గుంటూరు జెడ్పీ చైర్ పర్సన్ జానీమూన్ మధ్య విభేదాలు మరోమారు బహిర్గతమయ్యాయి. గుంటూరు జిల్లా కాకుమాను మండలం అప్పాపురంలో ‘జన్మభూమి’సభలో స్థానిక టీడీపీ నేతలపై జానీమూన్ విమర్శలు చేయడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో, ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని చెదరగొట్టారు. కాగా, తనకు, తన కుటుంబానికి మంత్రి రావెల నుంచి ప్రాణహాని ఉందంటూ జానీమూన్ ఇటీవల ఆరోపణలు చేయడం, ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు వారికి సర్దిచెప్పి, సమస్య సద్దుమణిగేలా చేయడం విదితమే.