: పాకిస్థాన్ కు ఊహకందని దెబ్బతప్పదు!: అమిత్ షా హెచ్చరిక
భారత్ పై ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగిస్తే పాకిస్థాన్ కు ఊహకందని దెబ్బ తప్పదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వార్నింగ్ ఇచ్చారు. ఢిల్లీలో నిర్వహించిన పార్టీ జాతీయ ప్రతినిధుల సభలో ఆయన మాట్లాడుతూ, పాక్ ఆగడాలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం మరోసారి చెక్ చెబుతుందని అన్నారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులో భారత సైన్యం నిర్వహించిన సర్జికల్ స్ట్రయిక్స్, ప్రధాని తీసుకున్న డీమోనిటైజేషన్ గురించి ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ తీరు మార్చుకోకుండా భారత్ కు ఉగ్రవాదులను ఎగుమతి చేసే విధానాన్ని కొనసాగిస్తే కనుక తీవ్రపరిణామాలు చవిచూడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.