: శశికళకు మరో ఎదురుదెబ్బ.. దినకరన్ కు 28 కోట్ల భారీ జరిమానా!
అన్నాడీఎంకే నూతన అధినేత్రి శశికళా నటరాజన్ కు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునేందుకు జయలలిత పోటీ చేసిన ఆర్కే నగర్ నియోజకవర్గం నుంచి బరిలో నిలవాలని చూస్తుండగా, అక్కడ చాలామంది ఆమెను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ కు మద్దతిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శశికళ సోదరి తనయుడు, అన్నాడీఎంకే నాయకుడు టీటీవీ దినకరన్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ భారీ జరిమానా విధించింది. పెరా ఉల్లంఘన కేసులో దినకరన్ కు ఈడీ 28 కోట్ల రూపాయల భారీ జరిమానా విధించినట్టు మద్రాసు హైకోర్టు ధ్రువీకరించింది.