: జగన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా!: భూమా నాగిరెడ్డి


తెలంగాణ వైసీపీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారి టీఆర్ఎస్ లో చేరితే ఇంతవరకు నోరు మెదపని జగన్... తమ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని టీడీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అన్నారు. ఏపీలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన ఎమ్మెల్యేలపై జగన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. జగన్ కు నాయకత్వ లక్షణాలే లేవని ఎద్దేవా చేశారు.

వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన జలయజ్ఞంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని భూమా ఆరోపించారు. తాను పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) ఛైర్మన్ గా ఉన్నప్పుడు అన్ని ఆధారాలను సేకరించానని... జలయజ్ఞంలో జరిగిన అక్రమాలపై బహిరంగ చర్చకు ఎవరైనా రావొచ్చని సవాల్ విసిరారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు ఎంతో మేలు జరుగుతుందని... కేవలం రైతులను రెచ్చగొట్టడానికే రైతుయాత్రను జగన్ చేపట్టారని విమర్శించారు. చంద్రబాబు విజన్ చాలా గొప్పదని ప్రశంసించారు. 

  • Loading...

More Telugu News