: ఇంగ్లండ్ తో ఆడే టిమిండియా వన్డే జట్టు ఇదే ...యువీకి మళ్లీ అవకాశం!
ఈనెల 15 నుంచి ఇంగ్లండ్ తో జరగనున్న వన్టే, టీ20 సిరీస్ ఆడనున్న టీమిండియా జట్టును చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ప్రకటించారు. ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, టీమిండియాకు పూర్తిస్థాయి కెప్టెన్ గా విరాట్ కోహ్లీని ఎంపిక చేశామని చెప్పారు. మహేంద్ర సింగ్ ధోనీ, కేెఎల్ రాహుల్, శిఖర్ ధావన్, యువరాజ్ సింగ్, సురేష్ రైనా, మనీష్ పాండే, కేదార్ జాదవ్, అజింక్యా రహనే, రిషబ్ పంత్, హార్డిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మన్ దీప్, అమిత్ మిశ్రా, జస్ ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్, యజువేంద్ర చాహల్, ఆశిష్ నెహ్రా లకు స్థానం కల్పించారు. జట్టులోకి యువీ పునరాగమనం చేయగా, గాయం నుంచి కోలుకున్న శిఖర్ ధావన్ కూడా స్థానం దక్కించుకున్నాడు.