: తెలంగాణ తిరుపతిగా యాదాద్రి : గవర్నర్
తెలంగాణ తిరుపతిగా యాదాద్రి అభివృద్ధి చెందుతుందని గవర్నర్ నరసింహన్ అభిప్రాయపడ్డారు. ఈరోజు ఆయన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం, అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. నిర్మాణ పనులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ను ఆయన తిలకించారు. ఈ సందర్భంగా నరసింహన్ మాట్లాడుతూ, భవిష్యత్తులో యాదాద్రి ప్రపంచస్థాయి పుణ్య క్షేత్రం అవుతుందని, డిజిటల్ టౌన్ గా యాదాద్రి మారుతుందని అభిప్రాయపడ్డారు.