: అలా ప్రవర్తించేవారిని మనుషులు అని ఎలా అంటాం?: కోహ్లీ
బెంగళూరులో మహిళల పట్ల జరిగిన దాడులపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బెంగళూరులో జరిగిన విషయం చాలా దారుణమని... కళ్లెదుట జరుగుతున్నదాన్ని చూసి కూడా ఆపలేని వారిని ఏమనాలని... అలాంటి వారిని మనుషులం అని అనగలమా? అని ప్రశ్నించాడు. మన సొంత కుటుంబీకులకు ఇలాగే జరిగితే చూస్తూ ఊరుకుంటామా? అని అన్నాడు. అడ్డుకునే వారు లేరు కాబట్టే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పాడు. ఇలాంటి సమాజంలో ఉన్నందుకు తాను సిగ్గుపడుతున్నానని అన్నాడు.
కోహ్లీ ప్రియురాలు, హాలీవుడ్ భామ అనుష్క కూడా ఈ ఘటనపై స్పందించింది. గుంపులో ఉన్న మహిళలను వేధిస్తున్నా, చుట్టుపక్కల ఉన్న వారు చూస్తూ ఊరుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. మానవత్వం లేని మనుషులు దుస్తుల గురించి, వేళల గురించి మాట్లాడతారని విమర్శించింది.