: నోరుందని మాట్లాడటం, తోచిందల్లా ట్విట్టర్‌లో రాసేయడం సరికాదు!: ట‌్రంప్‌పై అమెరికా ఉపాధ్యక్షుడి ఘాటు వ్యాఖ్య‌లు


నోరుందని మాట్లాడటం, తోచిందల్లా ట్విట్టర్‌లో రాసేయడం సరికాదంటూ అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ని ఉద్దేశించి ఆ దేశ‌ ఉపాధ్యక్షుడు ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జో బిడెన్ మాట్లాడుతూ... డొనాల్డ్ ట్రంప్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థల పనితీరును విమ‌ర్శించ‌డం ప‌ట్ల ఆయ‌న మండిప‌డ్డారు. ఆ సంస్థ‌ల‌ను విమ‌ర్శించ‌డం ఎంత ప్రమాదకరమో  ట్రంప్‌కి ఇప్ప‌టికీ తెలియట్లేదని అన్నారు.

ఆ సంస్థ‌ల‌పై విశ్వాసం లేదంటూ మాట్లాడ‌డం పిచ్చితనం లాంటిదేనని, ట్రంప్ ఇంకా ఎద‌గాల‌ని, అడల్ట్‌గా పరిణతి చెందాల్సిన అవసరం ఉంద‌ని వ్యాఖ్యానించారు. మ‌రో రెండు వారాల్లో అమెరికా అధ్యక్షుడిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్న ట్రంప్ ఎన్నో చట్టాలు, శాసనాలు రూపొందించాల్సిన అవ‌స‌రం ఉందని, జాగ్ర‌త్త‌గా మాట్లాడాల్సి ఉంద‌ని అన్నారు. ట్రంప్ ఇప్పుడు ఎంతో గట్టిగా ఏవేవో మాట్లాడుతున్నార‌ని, అధ్య‌క్ష బాధ్య‌త‌లు స్వీక‌రించాక‌ ఆయ‌న సాధించేదేంటో చూస్తామని అన్నారు.

  • Loading...

More Telugu News