: జయకు భారతరత్న విషయంలో జోక్యం చేసుకోం: హైకోర్టు
దివంగత ముఖ్యమంత్రి జయలలితకు భారతరత్న ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సూచించాలని దాఖలైన పిటిషన్ ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ఇలాంటి విషయాల్లో కోర్జు జోక్యం చేసుకోదని తెలిపింది. ఓ ట్రస్టుకు సంబంధించిన కేకే రమేష్ అనే వ్యక్తి ఈ పిటిషన్ ను దాఖలు చేశాడు. విచాణ సందర్భంగా జయ జీవిత చరిత్ర, సాధించిన విజయాలు, అవార్డులు, ఐదుసార్లు సీఎంగా పనిచేయడం తదితర వివరాలను కోర్టుకు విన్నవించాడు.
అమ్మ సంక్షేమపథకాలు, అమ్మ క్యాంటీన్, విద్యార్థులకు ల్యాప్ టాప్, సైకిళ్ల పంపిణీ తదితర పథకాలను చేపట్టారని చెప్పాడు. వాదనలు విన్న తర్వాత ఇలాంటి విషయాల్లో కోర్టు జోక్యం చేసుకోదని తెలిపింది. మరోవైపు, జయకు భారతరత్న ఇవ్వాలంటూ గత నెల 19న ప్రధాని మోదీని కలసి తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం విన్నవించిన సంగతి తెలిసిందే.