: సుఖేందర్ రెడ్డికి నా అంతటి స్థాయి ఎక్కడుంది?: కోమటిరెడ్డి


టీఆర్ఎస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంటరెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ లాబీలో ఏర్పాటు చేసిన చేనేత కౌంటర్ లో ఈరోజు ఆయన వస్త్రాలు కొనుగోలు చేశారు. ఆ తర్వాత అక్కడ ఉన్న మీడియాతో మాట్లాడుతూ, తన రాజకీయ శత్రువు గుత్తా సుఖేందర్ రెడ్డిపై విమర్శలు కురిపించారు. నల్గొండ జిల్లాలో ఎక్కడ నుంచైనా సరే పోటీ చేసి గెలిచే సత్తా తనకు ఉందని కోమటిరెడ్డి అన్నారు.

నల్గొండ ఎమ్మెల్యేగా గుత్తా పోటీ చేస్తే... ఆయనపై కేవలం ఒక కార్యకర్తను మాత్రమే పోటీగా నిలబెడతామని చెప్పారు. తమ కార్యకర్తపై కూడా గెలిచే సత్తా గుత్తాకు లేదని అన్నారు. తాము డబ్బు ఖర్చు చేసి ఎన్నికల్లో గెలిస్తే, గుత్తా ఎన్నికల్లో గెలిచి డబ్బు సంపాదిస్తున్నారని విమర్శించారు. తమ సోదరుల్లో ఎవరికి పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చినా సంతోషమే అని చెప్పారు. అయినా తమకు పదవులు ముఖ్యం కాదని...  రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడమే ప్రధానమని అన్నారు.

  • Loading...

More Telugu News