: ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమాకి వినోదపు పన్ను మినహాయింపు: ఆదేశాలు జారీ చేసిన కేసీఆర్
ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలసి 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమా ప్రీమియర్ కు ఆయనను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకి గానూ వినోదపు పన్నును మినహాయించినట్లు ప్రకటించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చారిత్రక వ్యక్తులపై తీసిన సినిమాలకు తమ ప్రభుత్వం సాయం అందిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ ఇటువంటి సినిమాలను ప్రోత్సహిస్తామని చెప్పారు. ఇటువంటి సినిమాలు మరిన్ని రావాలని ఆయన ఆకాంక్షించారు.