: చిట్ట చివరికి ప్రభాస్ ను ఇంటికి పంపేశా: రాజమౌళి


"చిట్ట చివరికి తుది రోజు వచ్చింది. ఇక ప్రభాస్ కు గుడ్ బై. మా సెట్స్ నుంచి అతన్ని బయటకు పంపేశాం" అని చెబుతూ, 'బాహుబలి: ది కన్ క్లూజన్' షూటింగ్ అధికారికంగా ముగిసినట్టు ప్రకటించాడు రాజమౌళి. ఈ ఉదయం 10:30 గంటల సమయంలో పెట్టిన ఈ ట్వీట్ వేలాది షేర్లను తెచ్చుకుంది. ఆపై "కృతజ్ఞతలు ప్రభాస్... మా ఒకే ఒక్క బాహుబలివి నువ్వే. నువ్వు చూపించిన నమ్మకం గొప్పది. సినిమా చిత్రీకరణలో నీ కమిట్ మెంట్ అందరికీ ఆదర్శం" అని ఓ ట్వీట్ ను పెట్టగా, ఆపై నేటితో 613 రోజుల బాహుబలి చిత్రీకరణ పూర్తయిందని వెల్లడించింది చిత్ర యూనిట్.

  • Loading...

More Telugu News