: బాబును పొగడుతూ, మోదీకి దూరంగా జరుగుతున్న వెంకయ్య... దీని భావమేంటి?: ఉండవల్లి ప్రశ్న
"మొన్న తిరుపతిలో సైన్స్ కాంగ్రెస్ జరిగింది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ వచ్చిన ఈ సభకు వెంకయ్యనాయుడు హాజరు కాలేదు. ఎందుకో తెలియదు. చంద్రబాబు పాల్గొనే ప్రతి సభకూ ఆయన వెళతారు. బాబును పొగడ్తలతో ముంచెత్తుతారు. ఇదే సమయంలో సొంత పార్టీ ప్రధాన మంత్రి మోదీకి వెంకయ్య దూరంగా జరుగుతున్నారు. ఆయన రాష్ట్రానికి వచ్చినా, ఆ సభకు రాలేదు సరికదా... కనీసం స్వాగతం కూడా పలకలేదు. దీని వెనక ఏముందో ఆ వెంకన్నకే తెలియాలి" అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. మోదీ వచ్చిన వేళ, వెంకయ్య తిరుపతికి ఎందుకు రాలేదో ఆయనే చెప్పాలని అన్నారు. ప్రధాని పాల్గొనే కార్యక్రమానికి మించి ఏం రాచకార్యాలు ఉన్నాయని ప్రశ్నించారు. నిజాలను బయటపెట్టి, జరిగిన నిజం చెప్పాలని, చరిత్ర హీనులుగా మిగలవద్దని విమర్శించారు.