: చంద్రబాబు ఘోర తప్పిదం చేశారు: ఉండవల్లి సంచలన వ్యాఖ్య
పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఘోర తప్పిదం చేశారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, పోలవరం కోసం కేంద్రంతో తాను సర్దుకుపోయానని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు యావత్ ఆంధ్ర ప్రజలను అవమానించినట్టేనని అన్నారు. తాను చేసిన వ్యాఖ్యలపై అర్థం ఏంటో ఆయనే చెప్పాలని అన్నారు. ప్రాజెక్టుల పేరుతో భూములను లాక్కొంటున్న ఏపీ ప్రభుత్వం ఆ భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పేరిట రూ. 1,800 కోట్లను గోదాట్లో పోస్తున్నారని ఆరోపించిన ఆయన, బాబు సర్కారు ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.