: నా సినిమాకు పన్ను రాయితీ ఇచ్చినందుకు ధన్యవాదాలు: కేసీఆర్తో బాలయ్య
దర్శకుడు క్రిష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమా ప్రీమియర్ కు తెలంగాణ సీఎం కేసీఆర్ను ఆ సినిమా హీరో నందమూరి బాలకృష్ణ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బాలకృష్ణ, కేసీఆర్ సినిమా గురించి కొద్దిసేపు మాట్లాడుకున్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి చారిత్రక కథ అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలో తన సినిమాకు పన్ను రాయితీ ఇచ్చినందుకు కేసీఆర్కు బాలకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమా తాను నటిస్తున్న 100వ సినిమా కావడంతో బాలకృష్ణ ఈ సినిమాను చూసేందుకు కేసీఆర్తో పాటు పలువురు ప్రముఖులని కూడా ఆహ్వానించే పనిలో బిజీబిజీగా ఉన్నారు.