: మీ కోసం స్పెషల్ షో వేస్తాం, రండి: కేసీఆర్ కు బాలయ్య ఆహ్వానం


తన 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమాను చూడాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను బాలకృష్ణ ఆహ్వానించారు. ఈ మధ్యాహ్నం తెలంగాణ అసెంబ్లీకి వచ్చిన బాలయ్య, సీఎం చాంబర్ కు వెళ్లి కేసీఆర్ ను కలిశారు. సినిమా చూడాలని కోరుతూ ప్రత్యేకంగా తయారు చేసిన ఆహ్వాన పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా కేసీఆర్ స్పందిస్తూ, శాతకర్ణి సినిమా చూసేందుకు తానెంతో ఎదురు చూస్తున్నానని, ఎప్పుడు ఎక్కడికి రమ్మన్నా వచ్చి సినిమా చూస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. ప్రజా ప్రతినిధులకు, వీఐపీలకు వీలుగా ఉండేలా, రిలీజ్ కు ముందే ఒక షోను ఏర్పాటు చేస్తున్నామని, దానికి రావాలని బాలయ్య కోరినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News