: కాసేపట్లో కేసీఆర్ తో బాలయ్య భేటీ.. 'గౌతమి పుత్ర శాతకర్ణి' ప్రీమియర్ కు ఆహ్వానం!
సినీనటుడు నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమా ఈ నెల 12న విడుదల కానున్న సంగతి తెలిసిందే. బాలయ్య నటిస్తున్న 100వ సినిమా కావడంతో ఈ సినిమాపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టి నటించారు.
కాగా, ఈ సినిమా ప్రీమియర్ కు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించాలని బాలయ్య నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటున్నారు. కేసీఆర్‌ను ఆహ్వానించడానికి కాసేపట్లో బాలకృష్ణ తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణానికి రానున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా కూడా కేసీఆర్‌ను బాలకృష్ణ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అప్పుడు బాలయ్యతో కేసీఆర్ ఈ సినిమా చూడడానికి కూడా తనను ఆహ్వానించాలని కోరారు. తన ఫ్యామిలీతో కలిసి వచ్చి చూస్తానని అప్పట్లో కేసీఆర్ అన్నారు.