: తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక్క డిసెంబర్ నెలలోనే రూ. 85 కోట్ల హుండీ ఆదాయం
గత సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చిన ఆదాయం, శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్యతో పాటు పలు వివరాలను టీటీడీ ఈవో సాంబశివరావు ఈ రోజు మీడియాకు తెలిపారు.
ఈ వివరాల ప్రకారం...
* హుండీ ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం: 1,018 కోట్ల రూపాయలు ( గత ఏడాది కంటే అదనంగా 114 కోట్ల ఆదాయం)
* ఒక్క డిసెంబర్ నెలలో హుండీ ఆదాయం: రూ. 85కోట్లు
* శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 2 కోట్ల 66 లక్షలు (ఈ సంఖ్య గత ఏడాది కంటే 20.73 లక్షలు ఎక్కువ)
* పంపిణీ చేసిన లడ్డూలు: 10 కోట్ల 34 లక్షలు.