: లాడెన్ కొడుకును 'గ్లోబల్ టెర్రరిస్ట్'గా ప్రకటించిన అమెరికా
ఆల్ ఖైదా నేత ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హంజాబిన్ లాడెన్ ను గ్లోబల్ టెర్రరిస్ట్ గా అమెరికా ప్రకటించింది. హంజాబిన్ వయసు 20 ఏళ్లు మాత్రమే. ఇతనిపై సెక్షన్ 1 కింద ఆంక్షలు విధించింది. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 13224 ప్రకారం అమెరికా రక్షణ, భద్రత కోసం హంజాబిన్ తో లావాదేవీలన్నింటినీ నిషేధించింది. హంజాబిన్ ను ఆల్ ఖైదా సభ్యుడిగా ఆ సంస్థ నేత అల్ జవహరి 2015 ఆగస్ట్ 14న ప్రకటించాడు. ఆ తర్వాత హంజాపై నిఘా పెట్టిన అమెరికా.... ఉగ్రవాద కార్యకలాపాల్లో అతను చురుకుగా పొల్గొంటున్నాడని నిర్ధారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో, అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది.