: సహకరించలేదని అమ్మాయి చెవులు కోసేసిన మృగాళ్లు!
నలుగురు మృగాళ్లు చేసిన దారుణమిది. అత్యాచారం చేస్తుంటే సహకరించలేదన్న కారణంతో ఓ అమ్మాయి చెవులను కోసేశారు. ఉత్తరప్రదేశ్ లోని భాగ్ పత్ జిల్లాలో జరిగిన ఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే, తన ఇంట్లో బాధితురాలు ఒంటరిగా ఉండగా, నలుగురు కామాంధులు బలవంతంగా జొరబడ్డారు. సామూహిక అత్యాచారానికి ప్రయత్నించగా, ఆ అమ్మాయి గట్టిగా ప్రతిఘటిస్తూ, అరిచి కేకలు పెట్టేందుకు ప్రయత్నించింది. ఎంతగా బలవంతపెట్టినా లొంగకపోవడంతో ఆగ్రహంతో ఆమె చెవులను కోసేసి వారు పారిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారా? లేదా? అన్న విషయం తెలియరాలేదు.