: మల్లన్న సేవలో వైసీపీ అధినేత జగన్
వైపీసీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ ఉదయం శ్రీశైల మల్లికార్జునుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ సంప్రదాయం ప్రకారం జేఈవో, అర్చకులు స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకున్న జగన్... మల్లన్నకు ప్రత్యేక పూజలు చేశారు.
కాగా, రైతు కుటుంబాలకు భరోసా కల్పించేందుకు జగన్ చేపట్టిన రైతు భరోసా యాత్ర రెండో రోజుకు చేరుకుంది. ఈ రోజు ఈ యాత్ర శ్రీశైలం నియోజకవర్గం దోర్నాలలో కొనసాగనుంది. యాత్రలో భాగంగా, తొలుత దోర్నాలలోని దివంగత వైఎస్ విగ్రహానికి జగన్ పూలమాల వేసి, నివాళులు అర్పిస్తారు. అనంతరం రైతులతో ఆయన మాట్లాడతారు. ఆ తర్వాత ఆత్మకూరు చేరుకుని బహిరంగసభలో ప్రసంగిస్తారు.