: ప్రముఖ నటుడు ఓంపురి కన్నుమూత!
ఓ నటశిఖరం కుప్పకూలింది. తన అసమాన నటనతో ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించి, ప్రేక్షకులను మెప్పించిన ప్రముఖ బాలీవుడ్ నటుడు ఓంపురి ఇక లేరు. గుండెపోటుతో ఆయన మృతి చెందారు. ఆయన వయసు 66 సంవత్సరాలు. 1950 అక్టోబర్ లో ఆయన హర్యాణాలో జన్మించారు. 1976లో ఆయన సినీరంగ్ర ప్రవేశం చేశారు. బాలీవుడ్ లోనే కాకుండా... మన దేశంలోని దాదాపు అన్ని భాషల్లో ఆయన నటించారు. తెలుగులో అంకురం, రాత్రి తదితర చిత్రాల్లో ఆయన నటించారు.
భారత ప్రభుత్వం ఓంపురిని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ప్రస్తుతం ఆయన ఒక పాకిస్థాన్ సినిమా, ఒక ఇంగ్లీష్, రెండు కన్నడ సినిమాలలో నటిస్తున్నారు. గత సంవత్సరం వచ్చిన 'జంగిల్ బుక్' సినిమా హిందీ వెర్షన్ లో 'భగీర' పాత్రకు గాత్రదానం చేశారు. ఆయన మరణ వార్త విని, భారతీయ సినీ పరిశ్రమ షాక్ కు గురయింది. పలువురు ప్రముఖులు ఆయన మరణం పట్ల సంతాపాన్ని ప్రకటించారు.