: మూడున్నరేళ్లు కష్టపడ్డ నా డార్లింగ్ కు థ్యాంక్స్: రాజమౌళి
"మూడున్నర సంవత్సరాల ప్రభాస్ కష్టం ముగిసింది. ఈ ప్రయాణం ఓ నరకం వంటిది. ఈ ప్రాజెక్టుపై నీకున్నంత నమ్మకం మరెవరికీ లేదు. థ్యాంక్స్ డార్లింగ్" అని 'బాహుబలి: ది కన్ క్లూజన్' షూటింగ్ పూర్తయిన సందర్భంగా తీసిన ఓ సెల్ఫీని షేర్ చేస్తూ రాజమౌళి ఓ ట్వీట్ ను పోస్టు చేశాడు. 'ఎంతో క్లిష్టమైన షూటింగ్ ను, రాత్రిపూట షాట్లను ముగించిన తరువాత ఆనందంగా ఉన్న ఈ ముఖాలను చూడండి' అంటూ, చిత్ర బృందంతో దిగిన ఫోటోను జక్కన్న పోస్టు చేశాడు. ఈ ఉదయం 7 గంటల సమయంలో పెట్టిన రాజమౌళి పోస్టులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కాగా, ఈ చిత్రం వేసవిలో విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.