: త‌ప్పిపోయిన సింహం పిల్ల‌ను త‌ల్లి ఒడికి చేర్చిన యువ‌కుడు.. 'వీడు మ‌గాడు' అంటూ పొగ‌డ్త‌లు!


త‌ల్లి నుంచి తప్పిపోయి దిక్కుతోచ‌క అల్లాడుతున్న ఓ సింహం పిల్ల‌ను తిరిగి త‌ల్లి ఒడికి చేర్చిన యువ‌కుడికి అట‌వీ అధికారులు, గ్రామ‌స్తుల నుంచి అభినంద‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. గుజ‌రాత్‌లోని వ‌డోద‌ర స‌మీపంలో గిర్ అట‌వీ ప్రాంతం ఉంది. ఇక్క‌డ‌కు ద‌గ్గ‌ర‌లో జునా ఉగ్లా అనే గ్రామం ఉంది. ప‌త్తిచేనులో ప‌నిలోకి వెళ్లిన గ్రామానికి చెందిన ఓ యువ‌కుడికి ఓ సింహం పిల్ల చేనులో త‌చ్చాడుతూ క‌నిపించింది. బ‌హుశా అది త‌ల్లి నుంచి త‌ప్పిపోయి ఉంటుంద‌ని గుర్తించిన యువ‌కుడు దానిని ప‌ట్టుకుని స్నేహితుల‌తో క‌లిసి దాని త‌ల్లి కోసం వెద‌క‌డం ప్రారంభించాడు.

చుట్టుప‌క్క‌ల గ్రామాల ప్ర‌జ‌ల‌ను క‌లిసి విష‌యం వివ‌రించారు. సింహం ఆచూకీ కోసం ఆరా తీశారు. అలా దాని కోసం 15 గంట‌ల‌పాటు వెతికారు. చివ‌రికి త‌మ ప్ర‌య‌త్నంలో విజ‌యం సాధించారు. సింహం పిల్ల త‌ల్లిని గుర్తించారు. దూరం నుంచి దానిని చూసిన యువ‌కులు బోనులో ఉన్న సింహం పిల్ల‌ను వ‌దిలి పెట్ట‌డంతో అది ర‌య్ మంటూ త‌ల్లి ఒడికి చేరింది. పిల్ల‌ను గుర్తించిన త‌ల్లి సింహం దానిని త‌న‌తో తీసుకెళ్ల‌డంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు. విష‌యం తెలిసిన అట‌వీశాఖ అధికారులు యువ‌కుడిని అభినందించారు. సింహంతో ఆట‌కు సిద్ధ‌మైన యువ‌కుడిని మ‌గాడంటూ పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు.

  • Loading...

More Telugu News