: మేము రెడీగా ఉన్నాం... భారత్ కు బుద్ధి చెబుతాం: పాక్ ఆర్మీ జనరల్
పాకిస్థాన్ తోక జాడిస్తే మరోసారి సర్జికల్ స్ట్రయిక్స్ కు దిగేందుకు సిద్ధంగా ఉన్నామని భారత్ ఆర్మీ చీఫ్ బిపిన్ చీఫ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా స్పందించారు. ఇస్లామాబాద్ లో ఆయన మాట్లాడుతూ, భారత్ ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా తిప్పికొట్టేందుకు తమ దళాలు పూర్తి సన్నద్ధంగా ఉన్నాయని తెలిపారు. భారత్ దుస్సాహసానికి దిగితే తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపినట్టు ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్పీఆర్) అధికార ప్రతినిధి మేజర్ జనరల్ అసిఫ్ గఫూర్ తెలిపారు. భారత్ చెబుతున్న సర్జికల్ స్ట్రయిక్స్ అంతా ఒట్టిదేనని ఆయన కొట్టిపడేశారు. మరోసారి సర్జికల్ స్ట్రయిక్స్ కు సిద్ధమన్న భారత ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు.