: సమన్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది: నవాజ్ షరీఫ్ ను హెచ్చరించిన సుప్రీంకోర్టు


పాకిస్థాన్ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ను ఆ దేశ సుప్రీంకోర్టు హెచ్చరించింది. పనామాగేట్ కేసు నేపథ్యంలో షరీఫ్‌ ను అధ్యక్ష పదవికి అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ ను విచారించిన పాక్ అత్యున్నత న్యాయస్థానం...పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేస్తే కనుక సమన్లు అందుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. లండన్‌ లో నవాజ్ కుటుంబానికి ఉన్న ఆస్తులపై వారి కుటుంబ సభ్యులు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తుండడం గురించి న్యాయస్థానం ముందుకు పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ పార్టీ న్యాయవాది నయీమ్ బుఖారీ తీసుకురాగా, స్పందించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం ‘‘గతంలో షరీఫ్ కుటుంబం లండన్‌ లోని ఆస్తులపై ఇచ్చిన ప్రకటనలకు విరుద్ధంగా ఇప్పుడు మాట్లాడితే ఉన్నత న్యాయస్థానం వారికి సమన్లు జారీ చేస్తుంది’’ అని స్పష్టం చేసింది. 

  • Loading...

More Telugu News