: నేను చెప్పింది తప్పుగా అర్థం చేసుకున్నారు: లియాండర్ పేస్


ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి తాను ఇప్పుడే రిటైర్ అవ్వడం లేదని భారత టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్ సమాధానమిచ్చాడు. ‘చెన్నై ఓపెన్ ఆడటం ఇదే చివరి సారా?’ అని విలేకరులు ప్రశ్నించగా, పైవిధంగా లియాండర్ పేస్ జవాబిచ్చాడు. టెన్నిస్ క్రీడాకారుడు సోమ్ దేవ్ రిటైర్మెంట్ ప్రకటనను తన వద్ద కొందరు ప్రస్తావించిన సందర్భంలో తాను చెప్పిన సమాధానాన్ని వారు సరిగా అర్థం చేసుకోలేదని అన్నారు.

‘ఇవాళ కావచ్చు, రేపు కావచ్చు, ఆరు నెలలు ఆగి కావచ్చు, లేకపోతే.. ఉన్నట్లుండి లియాండర్ ఫేస్ ఇప్పుడే రిటైర్ కావచ్చు’ అని తాను చెప్పిన సమాధానాన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. కాగా, 2018లో మరో ‘చెన్నై ఓపెన్’ ని సాధిస్తానని, టెన్నిస్ ఇంకా బాగా ఆడాలన్న కసి ఉందని ఈ సందర్భంగా పేస్ చెప్పారు.

  • Loading...

More Telugu News