: దీపికా పదుకునే పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక డిన్నర్ ఏర్పాటు చేసిన 'ట్రిపుల్ ఎక్స్' సినిమా యూనిట్!
బాలీవుడ్ అగ్రనటిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని, 'ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్' సినిమాతో హాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న దీపికా పదుకునేకు ఆ చిత్ర యూనిట్ స్పెషల్ డిన్నర్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఆ చిత్ర దర్శకుడు కారుసో మాట్లాడుతూ, దీపిక పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకమైన డిన్నర్ ఏర్పాటు చేశామని చెప్పారు. కాగా, దీపికా పదుకొనే రేపు 31వ ఏట అడుగుపెడుతోంది. దీపికా పదుకొనే ప్రస్తుతం 'ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్' సినిమా ప్రమోషన్ సహనటులతో కలిసి మెక్సికోలో బిజీగా ఉంది. ఈ సినిమా భారత్ లో సంక్రాంతికి విడుదల కానుండగా, ప్రపంచ దేశాల్లో ఈ నెలాఖరుకు విడుదల కానుంది.