: మా ప్యాలెస్ లో దెయ్యాలున్నాయని చెప్పడానికి ఆనందంగా ఉంది!: స్వీడన్ రాణి
దెయ్యం అన్న మాట వింటేనే ఎవరైనా సరే భయపడిపోతారు. అలాంటిది 'మేం దెయ్యాలతో సావాసం చేస్తున్నాం' అంటూ స్వీడన్ రాణి నవ్వుతూ చెబుతోంది. ‘నిజమే... మా ఇంట్లో దెయ్యాలున్నాయి. అవి చాలా ఫ్రెండ్లీగా కూడా వుంటాయి’ అంటోంది స్వీడన్ రాణి సిల్వియా. ‘మా ప్యాలెస్ లో దెయ్యాలు, భూతాలు సంచరిస్తున్నాయి. అయితే, వాటితో నాకు ఎటువంటి భయంలేదు. పైగా, నా ఒంటరితనం కూడా దూరమవుతోంది’ అంటూ, 'ఈ విషయం చెప్పడానికి చాలా ఆనందంగా ఉందని' ఆమె చెప్పడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కాగా, స్వీడన్ రాయల్ కుటుంబానికి స్టాక్ హోంలోని లవన్ ఐలాండ్ లో డ్రాటింగ్ హోమ్ ప్యాలెస్ ఉంది. 17వ శతాబ్దానికి చెందిన అద్భుతమైన ఈ రాజభవనంలో ప్రస్తుతం స్వీడన్ రాజు 16వ కార్ల్ గుస్తాఫ్ కుటుంబం నివసిస్తోంది.