: నాన్నకి బాగోలేదు... నేను బెంగళూరు ఎయిర్ పోర్టులో వున్నాను... విమానం 50 నిమిషాలు ఆలస్యం!: టీమిండియా ఆటగాడు షమీ


టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ తండ్రికి గుండెపోటు వచ్చింది. బెంగళూరులోని అకాడమీలో ప్రాక్టీస్ లో ఉండగా షమీకి కుటుంబం నుంచి ఈ సమాచారం అందడంతో హుటాహుటీన డిల్లీ బయల్దేరాడు. ఈ సందర్భంగా విమానాశ్రయానికి చేరుకున్న షమీకి, ఢిల్లీ వెళ్లాల్సిన విమానం 50 నిమిషాలు లేట్ అని సమాచారం ఇచ్చారు. దీంతో బాధను పంటిబిగువున భరించిన షమీ... సోషల్ మీడియాలో తన అభిమానులను తన తండ్రి కోసం ప్రార్థించాలని కోరాడు.

కాగా, గతవారం వ్యక్తిగత జీవితంలో ఎంతో ఆనందంగా ఉన్నానని చెప్పేందుకు షమీ.. తన భార్య, కుమార్తెతో కలిసి ఉన్న ఫోటోను ట్వీట్ చేశాడు. దీనిపై పలువురు నెటిజన్లు వ్యతిరేకత వ్యక్తం చేశారు. నువ్వసలు ముస్లింవేనా? అంటూ కొందరు ప్రశ్నించారు. అలాంటి వారందరికీ ఘాటుగా సమాధానమిచ్చిన షమీకి తండ్రి మద్దతుగా నిలిచారు. ఇస్లాం గురించి, ఇస్లాంలో ఏం చెప్పారో తమకు ఎవరూ కొత్తగా నేర్పించవద్దని, తమకు అంతా తెలుసని ఆయన స్పష్టం చేశారు.  

  • Loading...

More Telugu News