: 'మా ఇద్దరిదీ ఒకటే టేస్టు' అంటున్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్!


టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీదీ, తనదీ ఒకటే టేస్టని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ అన్నాడు. తామిద్దరికీ బైక్ లంటే చాలా ఇష్టమని అన్నాడు. ధోనీ దగ్గర చాలా బైకులున్నాయని, బైకుల గురించి తామిద్దరం చాలా మాట్లాడుకునే వాళ్లమని చెప్పాడు. ధోనీ కెప్టెన్ గా ఉండగా, టీమిండియాపై చాలా సార్లు ఆడానని క్లార్క్ గుర్తు చేసుకున్నాడు. ధోనీ అద్భుతమైన కెప్టెన్ అని పేర్కొన్నాడు. తన అద్భుతమైన కెప్టెన్సీతో చాలా సార్లు మ్యాచ్ ను ప్రత్యర్థి చేతుల్లోంచి ధోనీ లాగేసుకునేవాడని క్లార్క్ కితాబునిచ్చాడు. ధోనీకి కెప్టెన్ గా కొనసాగే సత్తా ఉన్నప్పటికీ వదులుకున్నాడని చెప్పాడు. కోహ్లీకి ధోనీ సహకారం ఉంటుందని క్లార్క్ చెప్పాడు. ధోనీకి సుదీర్ఘ కాలం ఆడేసత్తా ఉందని క్లార్క్ అభిప్రాయపడ్డాడు. 

  • Loading...

More Telugu News