: బెంగళూరు ఘటనపై నేను అలా అనలేదు: మంత్రి పరమేశ్వర


నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బెంగళూరులో మహిళలను వేధించిన ఘటనపై తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర అన్నారు. బెంగళూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వేడుకల్లో అలాంటి ఘటనలు జరగాలని తాను అనుకోలేదని, అలాంటి ఘటనలు జరుగుతుంటాయని అన్నారు. ఈ సంఘటన జరిగిన రోజు తనకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని చెప్పారు. ఇలాంటి ఘటనల వల్ల బెంగళూరుకు చెడ్డపేరు రాకూడదని, మహిళలకు బెంగళూరు అనువైన ప్రాంతమని పరమేశ్వర అభిప్రాయపడ్డారు. నగర వ్యాప్తంగా త్వరలో 5 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, ప్రస్తుతం ఉన్న పదిహేను ‘డయల్ 100’ ఫోన్ల సంఖ్యను 100కు పెంచుతామని చెప్పారు.

  • Loading...

More Telugu News