: మరో ఇరవై రోజుల్లో శాసనసభ భవన నిర్మాణ పనులు పూర్తవుతాయి: కోడెల
మరో ఇరవై రోజుల్లోగా శాసనసభ భవన నిర్మాణ పనులు పూర్తవుతాయిని ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. వెలగపూడిలోని శాసనసభ భవనాల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం, కోడెల మాట్లాడుతూ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో భవనాలు రూపుదిద్దుకుంటున్నాయన్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు, మూడో వారంలో బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉందని కోడెల పేర్కొన్నారు.