: ఇది ఫోటో కాదు....70 ఏళ్ల స్వాతంత్ర్య భారతావని చిత్రం అంటున్న రకుల్ ప్రీత్ సింగ్
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోను, దేశ ఐటీ రాజధాని బెంగళూరులోనూ చోటుచేసుకున్న సంఘటనల నేపథ్యంలో సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ స్పందించింది. 70 ఏళ్ల స్వాతంత్ర్య భారతావని చిత్రాన్ని రకుల్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. ఈ సందర్భంగా 'ఈ మనస్తత్వాలు ఎప్పుడు మారుతాయి?' అంటూ ప్రశ్నించింది. ఏదో ఒకరోజున కచ్చితంగా ఆడవాళ్లను వస్తువుగా చూడడం అనేదానిని మానేస్తారని ఆకాంక్షించింది. కాగా, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా కాస్మోపాలిటన్ నగరాలుగా పేరొందిన ఈ రెండు నగరాలలో యువతులను సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా లైంగికంగా వేధించిన సంగతి తెలిసిందే.