: ఇదే తమిళనాడులో అయితేనా, టీమిండియా మొత్తం సాక్షి వెంటపడేవాళ్లు!: నెటిజన్ల వ్యంగ్యం
టీమిండియా కెప్టెన్సీకి మహేంద్ర సింగ్ ధోనీ రాజీనామా చేయడంపై నెటిజన్లు ఆసక్తికరంగా స్పందించారు. ఇదే విషయం తమిళనాడులో జరిగి వుంటే... ఆయన భార్య సాక్షి కెప్టెన్సీ చేపట్టాలంటూ కోహ్లీ సేన మొత్తం ఆమె వెంటపడేదని ఓ నెటిజన్ చమత్కరించాడు. మరో నెటిజన్... 'జట్టు ప్రయోజనాల కోసం ధోని కెప్టెన్సీని వదులుకున్నాడు. పార్టీ ప్రయోజనాల కోసం ములాయం సింగ్ యాదవ్ తప్పు కోవడం లేదు!' అని పేర్కొన్నాడు.
'ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఇదే సమయంలో బీసీసీఐ కొత్త అధ్యక్షుడి కోసం వెతుకుతోంది. కోహ్లి కెప్టెన్సీలో ధోనీ ఆడాలన్న సంగతి మర్చిపోండి. అతడికి ధోని బిగ్ బాస్ కావొచ్చు!' అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. 'కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం గురించి ధోని నిర్ణయించుకున్నాడు. రోహిత్ శర్మ కూడా టీమిండియాలో స్థానం గురించి నిర్ణయిచుకోవాలని' ఇంకో నెటిజన్ పేర్కొన్నాడు. ఇలా సోషల్ మీడియాలో ధోనీ కెప్టెన్సీ గురించి పెద్ద చర్చ నడుస్తోంది.