: అఖిలేష్, ములాయంలకు ఈసీ నోటీసులు


సమాజ్ పార్టీ గుర్తు సైకిల్ కోసం తండ్రీకుమారులు ములాయం, అఖిలేష్ లు పోటీపడుతున్న సంగతి తెలిసిందే. సైకిల్ నాదంటే నాదంటూ ఇద్దరూ ప్రకటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరికీ ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఈనెల 9వ తేదీలోగా ఇద్దరూ బలం నిరూపించుకోవాలని నోటీసుల్లో పేర్కొంది. వీరిలో ఎవరికి ఎక్కువ మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు మద్దతు పలికితే, వారికి సైకిల్ గుర్తు కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తమకు 200 మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉందని అఖిలేష్ వర్గం ఇప్పటికే ప్రకటించుకుంది. అయితే, అఖిలేష్ వాదన చెల్లదంటూ ములాయం వర్గం చెబుతోంది. ఈ నేపథ్యంలో, ఇరువర్గాల మధ్య వివాదం మరింత ముదురుతోంది.

  • Loading...

More Telugu News