: బ్రిటీష్ రాణిపై తుపాకి ఎక్కుపెట్టిన గార్డు!


బ్రిటీష్ రాణి క్వీన్ ఎలిజబెత్-2పై ఓ గార్డు ఏకంగా తుపాకీ ఎక్కుబెట్టాడట. 'టైమ్స్' డైలీ ప్రకారం కొన్నేళ్ల క్రితం ఈ ఘటన జరిగింది. ఒక రోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో రాణికి నిద్రపట్టక... ప్యాలెస్ ప్రాంతంలో వాకింగ్ చేస్తున్నారట. ఆ సమయంలో విధుల్లో ఉన్న ఓ గార్డు ఆమెను చూశాడు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తిగా ఆమెను భావించిన సదరు గార్డు... వెంటనే తుపాకీ ఎక్కుపెట్టి, ఎవరు? అని అరిచాడట. మరుక్షణంలోనే ఆమెను రాణిగా గర్తించి, "యువర్ మెజెస్టీ, నేను మీపై కాల్పులు జరపబోయాను" అని చెప్పాడట.

జరిగిన దానికి తనకు కఠిన శిక్ష తప్పదని భావించాడట. అయితే జరిగిన దానిపై క్వీన్ స్పందిస్తూ, 'నీవు నన్ను కాల్చనవసరం లేకుండా, ఈసారి వాకింగ్ కు వచ్చేటప్పుడు నీకు ఫోన్ చేసి చెబుతా'నని సరదాగా అన్నారట. క్వీన్ ఎలిజబెత్-2కు నిద్ర సరిగా పట్టకపోతే ప్యాలెస్ లోని గ్రౌండ్స్ లో నడవటం అలవాటట!

  • Loading...

More Telugu News