: ఆ దేశంలో ఇప్పుడు 2009వ సంవత్సరం నడుస్తోంది...అందుకే న్యూ ఇయర్ జరుపుకోలేదట!


ప్రపంచ వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు హోరెత్తిపోయాయి. న్యూఇయర్ ను తమ సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించుకున్నారు. అయితే, ప్రపంచం మొత్తం ఇలా వేడుకలు నిర్వహించుకుంటే, అసలు ఈ న్యూఇయర్ తో సంబంధమే లేకుండా ఒక దేశం ఉంది. అదే ఇథియోపియా! ఈ దేశ విస్తీర్ణం 10,00,000 చదరపు కిలోమీటర్లు. 7,80,00,000 మంది జనాభా గల ఈ దేశంలో ఏడాదికి 13 నెలలు. పన్నెండు నెలలు ఒక్కోటీ ముప్పైరోజులు ఉండగా, పదమూడో నెలలో మామూలు సంవత్సరం ఐదు రోజులూ, లీపు సంవత్సరంలో ఆరు రోజులూ ఉంటాయి. వాళ్లు సెప్టెంబరు 11న (లీపు సంవత్సరం ముందు ఏడాదైతే 12న) నూతన సంవత్సరాన్ని జరుపుకుంటారు. దీంతో వారికి జనవరి 1న కొత్త సంవత్సరం రాదు. దీంతో వారంతా నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉన్నారు. అందుకే, వారికి ఇప్పుడు 2009వ సంవత్సరం నడుస్తోంది!

  • Loading...

More Telugu News