: రేష్మీ, అనసూయ బాటలో మరో టీవీ యాంకర్!
బుల్లి తెరపై సందడి చేస్తున్న పలువురు యాంకర్లు వెండితెరపై కూడా వెలిగేందుకు యత్నిస్తున్నారు. ఇప్పటికే రేష్మి, అనసూయలాంటి వారు సిల్వర్ స్క్రీన్ పై మెరిశారు. ఇప్పుడు వీరి బాటలోనే మరో యాంకర్ లాస్య అడుగులు వేస్తోంది. పలు రియాల్టీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన లాస్య... హీరోయిన్ గా పరిచయం కాబోతోంది. 'గుంటూరు టాకీస్' సినిమాను తెరకెక్కించిన ఆర్కే స్టూడియోస్ బ్యానర్ లో కృష్ణ దర్శకత్వంలో 'రాజా మీరు కేక' అనే సినిమా తెరకెక్కుతోంది. నోయెల్, రేవంత్, మిర్చీ హేమంత్ లు ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో లాస్య హీరోయిన్ గా పరిచయం అవుతోంది.