: ఎవరూ సాధించలేని రికార్డును సొంతం చేసుకున్న యూనిస్ ఖాన్!


పాకిస్థాన్ స్టార్ బ్యాట్స్ మెన్ యూనిస్ ఖాన్ చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన యూనిస్ 136 పరుగులు చేసి ఇంకా క్రీజులో ఉన్నాడు. ఈ నేపథ్యంలో, పదకొండు దేశాల్లో సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్ మెన్ గా యూనిస్ అవతరించాడు. టెస్టు హోదా లేని యూఏఈలో కూడా యూనిస్ సెంచరీ చేశాడు. అంతకు ముందు టెస్టు హోదా కలిగిన 10 దేశాల్లో ద్రవిడ్ మాత్రమే సెంచరీలు సాధించాడు. ఇప్పుడు ఆస్ట్రేలియా గడ్డపై శతకం బాదడం ద్వారా యూనిస్ అద్భుత రికార్డును సొంతం చేసుకున్నాడు. మరోవైపు, ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్ ని 8 వికెట్ల నష్టానికి 538 పరుగుల వద్ద ఆస్ట్రేలియా డిక్లేర్ చేయగా... పాకిస్థాన్ 8 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసి, ఇంకా 267 పరుగులు వెనుకబడి ఉంది. 

  • Loading...

More Telugu News