: కాపులను చంద్రబాబు పట్టించుకోవడం లేదు... ఇలా మాట్లాడితే అవకాశాలు రావన్న భయం కూడా లేదు!: సినీ నటి హేమ
ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చిన విధంగా కాపులకు రిజర్వేషన్లు కల్పించకుండా, అసలు కాపులను పట్టించుకోకుండా ఆయన నిర్లక్ష్యంగా వున్నారని సినీ నటి, గత ఎన్నికల్లో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైఖ్యాంధ్ర పార్టీ తరపున పోటీ చేసిన హేమ ఆరోపించింది. ఈ ఉదయం కాకినాడలో జరిగిన కాపు మహిళా సదస్సుకు హాజరైన హేమ ప్రసంగిస్తూ, ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలిపేందుకు తనంతట తానుగా ఇక్కడికి వచ్చినట్టు తెలిపింది. కాపు ఉద్యమంలో పాల్గొంటే, సినీ పరిశ్రమలో తనకు అవకాశాలు ఇవ్వకుండా తొక్కేస్తారన్న భయం లేదని ఆమె తెలిపింది. వెంటనే చంద్రబాబు తానిచ్చిన హామీని నెరవేర్చుకోవాలని డిమాండ్ చేసింది.