: '30 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ' పృధ్వీ యూటర్న్... నా మాటలు వక్రీకరించారు!


మెగాస్టార్ 150 చిత్రం 'ఖైదీ నం.150'లో తాను నటించిన సన్నివేశాలను తొలగించారని మీడియాకు ఎక్కిన '30 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ' పృధ్వీ యూటర్న్ తీసుకున్నాడు. తన పాత్రను తగ్గించారంటూ వచ్చిన వార్తలు అవాస్తవమని అన్నాడు. ఈ చిత్రం కోసం తాను కేవలం ఒక్క రోజు మాత్రమే నటించానని స్పష్టం చేసిన ఆయన, కొన్ని వెబ్‌ సైట్లు తన మాటలను వక్రీకరించాయని చెప్పాడు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించడమే తన అదృష్టమని, ఆ సీన్లు ఉంటాయా? ఉండవా? అన్నది దర్శకుడు, ఎడిటర్ల పరిధిలోనిదని చెప్పుకొచ్చాడు. కాగా, పృధ్వీ నటించిన సీన్లకు కత్తెర పడగా, దీనిపై పృధ్వీ బాహాటంగా విమర్శలు గుప్పించినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News