: ఓయ్... చిన్నారెడ్డిగారూ వినాలె!: కేసీఆర్


ఫీజు రీయింబర్స్ మెంట్ పై తెలంగాణ అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరుగుతున్న వేళ, ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము పాత నిబంధనలను, పదేళ్లనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న వేళ తయారు చేసిన నిబంధనలనే పాటిస్తున్నామని, ఆ విధానంలోనే చెల్లింపులు జరుపుతున్నామని స్పష్టం చేశారు. ఈ సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి కల్పించుకుని, సీఎం ప్రసంగాన్ని అడ్డుకోబోగా, "ఓయ్ చిన్నారెడ్డిగారూ వినాలె... ఏ పధ్ధతిలోనైతే గత కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించిందో... అదే పద్ధతిలో మేం చెల్లిస్తము. అందులో ఏం అనుమానమూ అక్కర్లేదు. ఈ 31 మార్చిలోపు 2015-16 బకాయిలు హండ్రెడ్ పర్సంట్ చెల్లిస్తాము" అని స్పష్టం చేశారు. ఈ సమస్య రోజూ పోతనే ఉంటదని, ఇది డైనమిక్ ఫిగరని, పోతానే ఉంటదని, రోజు రోజుకూ మారుతుందని గుర్తు చేశారు. క్లియర్ చేయాల్సిన బాధ్యత తమపై ఉందన్న సంగతి తెలుసునని, తామేం చేయాలో విపక్షాలతో చెప్పించుకోబోమని అన్నారు.

  • Loading...

More Telugu News