: ములాయం నిర్ణయాలను రద్దు చేసిన అఖిలేష్!
ఉత్తరప్రదేశ్ లోని సమాజ్ వాదీ పార్టీలో తనకే ప్రజా ప్రతినిధుల బలం అధికంగా ఉందని సీఎం అఖిలేష్ యాదవ్ నిరూపించుకుంటున్నారు. ములాయం అండగా, శివపాల్ యాదవ్ తొలగించిన నాలుగు జిల్లాల పార్టీ అధ్యక్షులను తిరిగి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు శివపాల్ యాదవ్ జిల్లా అధ్యక్షులపై వేసిన సస్పెన్షన్ వేటును రద్దు చేస్తున్నట్టు ప్రకటించి, తనదే అసలైన సమాజ్ వాదీ పార్టీ అన్న సంకేతాలు వెలిబుచ్చారు. ఈ మేరకు అఖిలేష్ నియమించిన పార్టీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడు నరేష్ ఉత్తమ్ పేరిట మీడియాకు ప్రకటన వెలువడింది. తమ జాతీయ అధ్యక్షుడి సూచనల మేరకు వీరిపై సస్పెన్షన్ తొలగించినట్టు నరేష్ వెల్లడించారు. రాష్ట్రంలో అసలైన సమాజ్ వాదీ తమదేనని, ఎన్నికల సంఘం సైతం తమనే గుర్తిస్తుందని, ప్రజా ప్రతినిధుల్లో 80 శాతం మందికి పైగా తమ వెంటే ఉన్నారని ఆయన తెలిపారు.