: బెంగళూరులో న్యూ ఇయర్ అరాచక కాండ... గుర్తించింది నలుగురిని మాత్రమే!
కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా బెంగళూరు వీధుల్లో యువతులు, మహిళలపై జరిగిన అరాచక కాండలో ఇప్పటివరకూ కేవలం నలుగురిని మాత్రమే పోలీసులు గుర్తించారు. పలువురు అమ్మాయిలను వేధించిన వారిలో, సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ లను పరిశీలించి నలుగురిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. యువతుల వేధింపుల పర్వంలో ప్రధాన నిందితుడి పేరు లెనో అని, మరో ఇద్దరిని గుర్తించి, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపినట్టు 'న్యూస్ 18'లో కథనం వెలువడింది. తూర్పు బెంగళూరులో భారతావనిని దిగ్బ్రాంతికి గురి చేసిన ఘటనలో బైకుపై ఉన్న వ్యక్తులతో పాటు నలుగురిని అరెస్ట్ చేశామని తెలిపారు. వేధింపులపై తమకు ఫిర్యాదులు రాలేదని, మీడియాలో చూసిన తరువాతనే తాము స్పందిస్తున్నామని పోలీసులు తెలపడం గమనార్హం.