: శశికళ పుష్ప దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
చెన్నయ్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే, ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ఈ రోజు విచారణకు వచ్చింది. జయలలిత మృతిపై సీబీఐతో విచారణ జరపాలని ఆమె తరఫు న్యాయవాది వాదించారు. వాదనలు విన్న అనంతరం శశికళ పుష్ప దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.