: నరేంద్ర మోదీ మాస్టర్ స్ట్రోక్ ఇది: బీజేపీ ట్వీట్


మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీంకు చెందిన రూ. 15 వేల కోట్ల ఆస్తులను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం సీజ్ చేయడాన్ని నరేంద్ర మోదీ 'మాస్టర్ స్ట్రోక్'గా బీజేపీ అభివర్ణించింది. మోదీ ద్వైపాక్షిక విధానాలు సాధించిన అతిపెద్ద విజయాల్లో ఇది కూడా ఒకటని బీజేపీ అధికారిక ట్విట్టర్ ఖాతా వెల్లడించింది. 2015లో తన యూఏఈ పర్యటనలో భాగంగా అక్కడి ప్రభుత్వానికి దావూద్ ఇబ్రహీం ఆస్తులపై పూర్తి సమాచారాన్ని ఇచ్చి వచ్చారని, దాని ఆధారంగానే అక్కడి అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకున్నారని వెల్లడించింది. ఇండియాలో చట్టాల మేరకు దావూద్ కు శిక్ష పడాలన్నదే ప్రభుత్వ అభిమతమని పేర్కొంది.

  • Loading...

More Telugu News