: పొత్తు పెట్టుకుంటే... అఖిలేష్ కోసం తప్పుకుంటా: ఢిల్లీ మాజీ సీఎం


ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలకు నగారా మోగింది. ఈ నేపథ్యంలో, దేశంలోనే పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజుకుంది. పొత్తుల పర్వం ప్రారంభమయింది. ఈ క్రమంలో, సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. వాస్తవానికి యూపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

ఈ సందర్భంగా షీలా దీక్షిత్ మాట్లాడుతూ, యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ తనకంటే చాలా చిన్నవాడు అయినప్పటికీ... తన కంటే మెరుగైన అభ్యర్థి అని కితాబిచ్చారు. ఒకవేళ ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు పొత్తు పెట్టుకుంటే... ముఖ్యమంత్రి రేసు నుంచి తాను తప్పుకుంటానని చెప్పారు. మరోవైపు కాంగ్రెస్, ఎప్పీలు పొత్తు పెట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. 

  • Loading...

More Telugu News